Ukraine Swimmer Blown Up: స్విమ్మింగ్ అని వెళ్లాడు.. కుటుంబం ముందే ముక్కలుగా పేలిపోయాడు..

Ukraine: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఎంతోమంది సామాన్య ప్రజల జీవితాలను చీకటి చేసింది. ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుండి బయటికి రావడం లేదు. పరిస్థితులు మామూలుగా కనిపించినా కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలని అక్కడి ప్రభుత్వాలు రూల్స్ పెట్టినా అవి కొందరు పాటించడం లేదు. అలా పాటించక పోవడం వల్లే ఓ 50 ఏళ్ల వ్యక్తి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు.
రష్యాతో యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అక్కడి ఒడెస్సా ప్రాంతంలోని సముద్రంలో ల్యాండ్ మైన్‌లను ఏర్పాటు చేసింది. అందుకే నీటిలోకి ఎవరూ వెళ్లకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ కొందరు ప్రజలు మాత్రం అక్కడికి వెళ్లి బీచ్‌ను చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా నీటిలోకి కూడా దిగుతున్నారు. దీంతో ఓ వ్యక్తి అలాంటి ఓ ల్యాండ్ మైన్ పేలి తన కుటుంబం కళ్ల ముందే చనిపోయాడు.
ఓ 50 ఏళ్ల వ్యక్తి.. తన భార్య, కొడుకు, స్నేహితుడితో కలిసి ఒడెస్సా ప్రాంతంలోని సముద్రం చూడడానికి వెళ్లాడు. స్విమ్మింగ్ చేస్తానని చెప్పి సముద్రంలోకి దిగాడు. ఇంతలోనే ఆ ల్యాండ్ మైన్ పేలి అతడి శరీరం ముక్కలయిపోయింది. తన శరీర భాగాలు వచ్చి తన కుటుంబం కూర్చున్న చోటులోనే పడడం మరింత విషాదకరం. పోలీసులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ప్రజలు రూల్స్‌ను తప్పకుండా పాటించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com