UAE Rains : అరబ్ దేశాల్లో కుండపోత వర్షాలు.. 27 ఏళ్ల తరువాత మొదటి సారి..

X
By - Divya Reddy |30 July 2022 3:15 PM IST
UAE Rains : భారీ వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కకావికలమవుతోంది
UAE Rains : భారీ వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కకావికలమవుతోంది. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. వందలాది మంది వరదల్లో చిక్కుకున్నారు.
సహాయక బృందాలు, సైన్యం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సుమారు 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా రాతి ఎడారి ప్రాంతంగా పేరుపొందిన ఫుజైరా, షార్జాల్లో కురిసిన భారీ వర్షమే వరదలకు కారణమైనట్టు అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో ఏకంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com