China Corona: చైనాను వణికిస్తోన్న కరోనా.. వేలల్లో కేసులు.. భారీ సంఖ్యలో మరణాలు..

China Corona: కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న చైనాలో మరోసారి వైరస్ విజృభిస్తోంది. లాక్‌డౌన్‌ల మీద లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. దీంతో ప్రజలు కరోనా కంటే లాక్‌డౌన్‌కే ఎక్కువ భయపడిపోతున్నారు. అంతేకాదు, జీరో కరోనా పాలసీతో.. బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా కోవిడ్ టెస్టింగ్ సెంట్ వద్ద ఓ మహిళకు బలవంగా కరోనా పరీక్ష చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో… ఆమె పరీక్ష చేయించుకోవటానికి నమూనాలు ఇవ్వటానికి సహకరించటంలేదు. దీంతో వైద్య సిబ్బంది ఆమె మీద కూర్చుని మరీ నమూనాలు సేకరిస్తున్నారు. ఈ వీడియో చూసినవారు చైనీయుల పరిస్థితిని తలచుకుని జాలిపడుతున్నారు.
అక్కడ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటు షాంఘైలో కూడా బలవంతంగా కరోనా పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ.. కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది.
అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాజధాని బీజింగ్‌లో 500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో.. ఎక్కడ షాంగై తరహా లాక్‌డౌన్ అమలు చేస్తారో అని హడలి పోతున్నారు అక్కడి ప్రజలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com