Sajith Premadasa : లంకకు కాబోయే నూతన అధ్యక్షుడు సజిత్ ప్రేమదాస ఎవరంటే..?

Sajith Premadasa : లంకకు కాబోయే నూతన అధ్యక్షుడు సజిత్ ప్రేమదాస ఎవరంటే..?
X
Sajith Premadasa : సజిత్ ప్రేమదాస శ్రీలంకలోని రాజకుటుంబంలో 1967 జనవరి 12న జన్మించారు.

Sajith Premadasa : శ్రీలంకకు కాబోయే నూతన అధ్యక్షుడు సజిత ప్రేమదాస ఎవరు..? శ్రీలంక రాజకీయాల్లో ఆయన స్థానమేంటి. ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఏంటా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తలెత్తుతున్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అధ్యక్ష భవనంలోకి ప్రజలు దూసుకెళ్లడం.. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటడం.. లాంటి పరిస్థితులను మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈ సమస్యల నుంచి ప్రజల్ని గట్టెక్కిస్తతనని సజిత్ ప్రేమదాస ముందుకు వచ్చారు.

సజిత్ ప్రేమదాస శ్రీలంకలోని రాజకుటుంబంలో 1967 జనవరి 12న జన్మించారు. ఆయన తండ్రి రణసింగే ప్రేమదాస శ్రీలంకకు 1989 నుంచి 1993 వరకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రేమదాస మార్లిండ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఆయన తండ్రి అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింగేను హత్య చేశారు.

తరువాత ఆయన రాజకీయ అడుగుపెట్టారు. 2000లో ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం వైద్య శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. 2015లో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2019లో శ్రీలంక అధ్యక్ష పదవికి పోటీ చేసి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదే సంవత్సరంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నికయ్యారు జనవరి 3 నుంచి ఆయన శ్రీలంక ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు.

సజిత్ ప్రేమదాస లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఆయనకున్న ఆదరణ , అనుభవంతో శ్రీలంకను సమస్యల నుంచి బయటపడేస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story