ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

X
By - shanmukha |27 Sept 2020 5:07 PM IST
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం జరిగిన 75వ యునైటెడ్ నేషన్స్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం జరిగిన 75వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంలో భారత్ కృషి చేస్తుందని అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై టెడ్రోస్ ఆయనను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కరోనా పోరాటంలో ప్రపంచ దేశాలకు మద్దతుగా నిలుస్తున్న మోదీకి ధన్యవాదాలని టెడ్రోస్ తెలిపారు. కరోనా కాలంలో భారత్ ప్రపంచ దేశానికి మందులు సరఫరా చేసినా విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే కలసికట్టుగా ఉండి సహకారం అందించుకోవాలని, అప్పుడే కరోనా వైరస్‌ను అంతమొందించగలమని ఆయన పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com