Cricket: IPLలోకి దాదా రీ ఎంట్రీ... ఫ్యాన్స్ కు పూనకాలే..

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతేడాది ఆక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన దాదా మరోసారి ఐపీఎల్ కు సేవలు అందించబోతున్నాడు.
గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా నియమించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలైయ్యాయి. భారత మాజీ కెప్టెన్ BCCI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు IPL 2019లో సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీవిరమణ చేసిన అనంతరం గంగూలీ ఇప్పటిదాకా క్రికెట్ జోలికి వెళ్లకపోవడం గమనార్హం. ఎట్టకేలకు దాదా తిరిగి క్రికెట్ బిసిసిఐ అధ్యక్షుడిగా తన హవా చూపించనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com