SRH vs KXIP : స్వల్ప స్కోరుకే పంజాబ్ ఆలౌట్..!

చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ రాహుల్(4) ఆరంభంలోనే నిరాశపర్చగా.. హిట్టర్ పూరన్ (0) డైమండ్ డక్ గా వెనుదిరిగాడు. ఎన్నో ఆశలు రేపిన మయాంక్(22), గేల్(15), షారుఖ్ (22) కాస్త మెరిపించినా.. తక్కువకే ఔటయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ 3, అభిషేక్ 2 వికెట్లు తీయగా.. భువీ, కౌల్, రషీద్ తలో వికెట్ సాధించారు.
కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. సన్ రైజర్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీ20ల్లో 5వేల పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ ఫీట్ వేగంగా సాధించిన ఇండియన్ గా నిలిచాడు. రాహుల్ 143 ఇన్నింగ్స్ ల్లోనే 5వేల మార్క్ అందుకోగా.. కోహ్లి (167), రైనా(173), ధావన్(181), రోహిత్ (188) తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గేల్(132 ఇన్నింగ్స్) టాప్ లో ఉండగా.. రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com