KKR vs RCB జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా..!

KKR vs RCB  జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా..!
ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరుణ్‌, సందీప్‌ వారియర్‌కు కరోనా సోకినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది.

ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరుణ్‌, సందీప్‌ వారియర్‌కు కరోనా సోకినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. ఈ నెల 30న జరిగే ఫైనల్స్‌ కంటే ముందే ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే కొందరు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు బయో బబుల్‌లో ఉండలేక లీగ్ నుంచి వైదొలిగారు. ఎన్నో జాగ్రత్తల మధ్య బయో బబుల్‌ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags

Next Story