Sports: సచిన్ ఎక్కడ? కోహ్లీ ఎక్కడ? గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Sports: సచిన్ ఎక్కడ? కోహ్లీ ఎక్కడ? గంభీర్ సంచలన వ్యాఖ్యలు
సచిన్‌, కోహ్లీ పై.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. గంభీర్ వ్యాఖ్యలతో వాళ్లంతా విరుచుకుపడుతున్నారు. కోహ్లీ సెంచరీలపై గంభీర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు గంభీర్ ఏమన్నాడు.. కోహ్లీ ఫ్యాన్స్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు.. ఒకసారి చూద్దాం...


కొత్త ఏడాది విరాట్ కు బాగా కలిసి వచ్చినట్లుంది. గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ అద్భుతమైన సెంచరీ చేశారు. కేవలం 87 బంతుల్లో 12 ఫోర్లు ఓ సిక్సర్ తో 113 పరుగులు చేసి కోహ్లీ రికార్డ్ సృష్టించారు. టీమిండియా స్టార్ ఆటగాడు కోహ్లీ బాదుతుంటే క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. ఇదివరకే కోహ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్లను ఎన్నో బద్దలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి, గంభీర్ పై ఎందుకు విరుచుకుపడుతున్నారు?



సచిన్ రికార్డులను ఎన్నో బద్దలు కొట్టిన కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టడమే ఇందుకు కారణం. వన్ డే క్రికెట్లో అత్యంత వేగంగా 12,500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. కేవలం 257 మ్యాచుల్లోనే ఈ రికార్డ్ ను కోహ్లీ సాధించాడు. అయితే సచిన్ కు మాత్రం ఈ మార్క్ దాటడానికి 310 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. అదేవిధంగా స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లీ సమం చేశారు. దీంతో విరాట్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.



ఈ సందర్భంగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ రికార్డులపై గంభీరమైన వ్యాఖ్యలు చేయడమే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కోహ్లీని పోల్చడం సరికాదంటూ గంభీర్ అభిప్రాయపడ్డారు. సచిన్ ఆడే సమయంలో క్రికెట్ రూల్స్ వేరే విధంగా ఉండేవని ..చాలా కఠినంగా ఉండేవని గంభీర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ కు అప్పటి రూల్స్ చాలా కష్టతరంగా ఉండేవని గంభీర్ తెలిపారు. ఫీల్డింగ్ ఆంక్షలు బ్యాట్స్ మెన్ లకు అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టంగా ఉండేదని అన్నారు. దాంతో నెటిజన్ లు ఫైర్ అవుతున్నారు.



స్టార్ స్పోర్ట్స్ షో లో గంభీర్ మాట్లాడుతూ "కోహ్లీని సచిన్ తో పోల్చడం సరికాదు.. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి.. ఫీల్డ్ లో 36 గజాల సర్కిల్ వెలుపల ఐదు మంది కంటే ఎక్కువ ప్లేయర్స్ ఉండేవారు. దాంతో బౌండరీలు కొట్టడం అంత ఈజీగా ఉండేది కాదు" అన్నారు. అంటే ఇప్పుడు రూల్స్ బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా ఉన్నాయి కాబట్టే కోహ్లీ ఈజీగా రన్స్ చేస్తున్నారని గంభీర్ మాటల్లో అర్థం గా కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story