Jobs in Air Bus: ఇంజనీరింగ్ అర్హతతో ఎయిర్‌బస్‌లో జాబ్స్... ఈ నెల 26, 27న రిక్రూట్‌మెంట్ డ్రైవ్...

Jobs in Air Bus: ఇంజనీరింగ్ అర్హతతో ఎయిర్‌బస్‌లో జాబ్స్... ఈ నెల 26, 27న రిక్రూట్‌మెంట్ డ్రైవ్...
Jobs in Air Bus: ఈ నెల 26,27 తేదీల్లో వింగ్స్ ఇండియా ఎయార్ షోలో ఈ ప్రత్యేకమైన రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను తెలంగాణ ప్రభుత్వం సహాయంతో నిర్వహిస్తోంది.

Jobs in Air Bus: ఐటీ విభాగాల్లో ప్రముఖ కంపెనీ ఎయిర్ బస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ టాలెంట్ హంట్ ను హైదరాబాద్ లో జరుగుతున్న ఎయిర్ షోలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 26,27 తేదీల్లో వింగ్స్ ఇండియా ఎయార్ షోలో ఈ ప్రత్యేకమైన రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను తెలంగాణ ప్రభుత్వం సహాయంతో నిర్వహిస్తోంది. ఎయిర్ బస్ సూచించిన విభాగాల్లో అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ విద్యార్థులు అప్లై చేయాలి. శని, ఆదివారాల్లో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లోని హాల్ A లోని స్టాండ్ 12లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంతో ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను కంపెనీ సీనియర్ అధికారులు నిర్వహిస్తున్నారు.

ఔత్సాహికులు ఎయిర్ షోకు వెళ్లి ఎయిర్ బస్ గురించి తెలుసుకోవడంతో పాటు కంపెనీలో ఉన్న కెరీర్ అవకాశాల గురించి ఆరా తీయవచ్చు. ఎయిర్ బస్ ఇండియా ఏవియానిక్స్ సాప్ట్ వేర్, ఎయిర్ క్రాప్ట్ సిస్టమ్ స్టిమ్యులేషన్, ఎయిర్ ఫ్రేమ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు.

వీటితో పాటు సైబర్ సెక్యూరిటీ, API డెవలప్ మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్ మెంట్, బిగ్ డేటా, క్లౌడ్, DevOps మరియు loT వంటి డిజిటల్ టెక్నాలజీ విభాగాల్లో కూడా అభ్యర్ధుల కోసం అన్వేషిస్తోంది. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్ధులు దొరికతే అక్కడికక్కడే ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేస్తామని కంపెనీ అధికారులు వివరిస్తున్నారు.

ఎయిర్ బస్ ఇండియా ఇంజనీరింగ్ కార్యకలాపాలు, లోడ్లు, ఏరోడైనమిక్స్, ఏవియానిక్స్ సాప్ట్ వేర్ డిజైన్, టెస్టింగ్, డిజిటల్ మాక్ అప్ మరియు సిస్టమ్ ఇన్ స్టాలేషన్ వంటి విభాగాల్లో సమర్ధులైన అభ్యర్ధుల కోసం చూస్తోంది.

ఎయిర్ బస్ ఇండియా ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, ERP సొల్యూషన్స్ తో పాటు బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ వంటి డిజిటల్ సామర్థ్యాలపై ఇన్ సోర్సింగ్ అభ్యర్ధుల కోసం చూస్తోంది. ఇప్పటికే దేశంలో 7వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 6వేల మందికి అవకాశాలు కల్పించాలని చూస్తోంది కంపెనీ.

Tags

Next Story