టెన్త్ అర్హతతో ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ. 21,300

టెన్త్ అర్హతతో ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ. 21,300
X
పదో తరగతి అర్హతతో చెన్నై ఎయిర్ పోర్టులోని కార్గో లాజిస్టిక్స్ విభాగం ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పదో తరగతి అర్హతతో చెన్నై ఎయిర్ పోర్టులోని కార్గో లాజిస్టిక్స్ విభాగం ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయస్సు 2013 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.250. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకపోయినప్పటికీ అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులు చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.21,300 వేతనం చెల్లిస్తారు.

Tags

Next Story