కియా కార్ల కంపెనీలో ఉద్యోగాలు.. ఈ రోజే ఇంటర్వ్యూలు

కియా కార్ల కంపెనీలో ఉద్యోగాలు.. ఈ రోజే ఇంటర్వ్యూలు
అనంతపురం కియా మోటార్స్‌లో ఉద్యోగాలు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలోని కియా కార్ల కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో డిప్లొమో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. అభ్యర్థులకు 18-25 ఏళ్ల వయసు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ వివరాలు:

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 16న ఉదయం 9 గంటలకు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్ధులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతారు. కాబట్టి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ప్రిపేరై వెళితే ఫలితం ఉంటుంది. ఇతర వివరాలకు 8074370846,9848819682,7981938644 నంబర్లలో సంప్రదించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story