Axis Bank: కెరీర్ గ్యాప్ మహిళలకు గుడ్ న్యూస్.. యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగాలు..

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ గృహిణుల కోసం 'HouseWorkIsWork' అనే పేరుతో ఒక ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది అన్ని వయసుల వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. ట్రాన్స్ జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని బ్యాంక్ కెరీర్ పేజీలో పోస్ట్ చేసింది.
విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం ఉన్న మహిళలు వివాహానంతరం కుటుంబ భాద్యతలు, పిల్లలతో ఉద్యోగానికి విరామం వస్తుంది. అన్ని అర్హతలు ఉన్న వారు తిరిగి తమ కెరీర్ పై దృష్టి పెట్టే అవకాశాన్ని కల్పిస్తోంది యాక్సిస్ బ్యాంక్. పోస్టును బట్టి ఇంట్లో ఉండి కూడా పని చేసే వెసులు బాటు కల్పిస్తోంది.
గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ కనీస విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కమ్యూనికేషన్ మీద మంచి పట్టు ఉండాలి. పని ఒత్తిడిని నిర్వహించగల సామర్థ్యం, గడువులోగా టార్గెట్లను పూర్తి చేయడం వంటి స్కిల్స్ కలిగి ఉండాలి. టీమ్ ప్లేయర్‌గా బాధ్యతలు నిర్వహించగల ఆసక్తి, నైపుణ్యంతో పాటు అవసరమైన Android/ iOS వెర్షన్‌తో కూడిన మొబైల్ పరికరం ఉండాలి.
బ్యాంకింగ్ రంగంలో అనుభవం లేని మహిళలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకుంటారు. కేవలం నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తోంది బ్యాంకు .
మహిళలకో మంచి అవకాశం.. కెరీర్ లో గ్యాప్ తీసుకున్న వారికి 'యాక్సిస్ బ్యాంక్' లో ఉద్యోగాలు..ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ గురించి ప్రకటించిన వెంటనే మంచి స్పందన లభించిందని బ్యాంక్ పేర్కొంది. దాదాపు 3000 దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయని బ్యాంక్ హెచ్ ఆర్ అన్నారు. బ్యాంకులో పని చేసే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపారు. జీతం వారి అనుభవం, స్కిల్స్ పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు బ్యాంకు అధికారిక వెబ్ సైట్ సందర్శించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com