BEL Jobs in Hyderabad: ఇంజనీరింగ్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. 50,000

BEL Jobs in Hyderabad: ఇంజనీరింగ్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. 50,000
BEL Jobs in Hyderabad: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) హైదరాబాద్‌లో 84 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేసేందుకు ఈ రోజు ఆఖరు తేదీ. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు..

BEL Jobs in Hyderabad: 1. హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్‌లో ట్రైనీ. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 84 ఖాళీలు ఉన్నాయి.

2. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

3. మొత్తం 84 ఖాళీలు ఉండగా ట్రైనీ ఇంజనీర్ పోస్టులు 9 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో బీఈ, బీటెక్, బీఎస్‌సీ పాస్ కావాలి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులు 11 ఉన్నాయి. మెకానిక్‌లో బీఈ, బీటెక్, బీఎస్‌సీ పాస్ కావాలి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులు 3 ఉన్నాయి. మెకానికల్‌లో బీఈ, బీటెక్, బీఎస్‌సీ పాస్ కావాలి.

4.ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 36. ఎలక్ట్రానిక్స్‌లో బీఈ, బీటెక్, బీఎస్‌సీ పాస్ కావాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులు 8. మెకానికల్‌ల్ బీఈ, బీటెక్, బీఎస్‌సీ పాస్ కావాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) పోస్టులు 6, కంప్యూటర్ సైన్స్‌లో బీఈ, బీటెక్, బీఎస్‌సీ పాస్ కావాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 1, ఎలక్ట్రికల్స్‌లో బీఈ, బీటెక్, బీఎస్‌సీ (ఇంజనీరింగ్) పాస్ కావాలి.

5.అభ్యర్ధుల వయసు 2021 డిసెంబర్ 31 నాటికి ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు రూ.200. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.500 పీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు ఏడాది, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

6. వేతనాల వివరాలు.. ట్రైనీ ఇంజనీర్‌కు మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 ప్రాజెక్ట్ ఇంజనీర్‌‌‌కు మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000.

7. కాంట్రాక్ట్ గడువు వివరాలు ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు ఒక ఏడాది. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రెండేళ్లు. సంస్థ అవసరాలు, అభ్యర్ధి పనితీరును బట్టి మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్ధులు ముందుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

8. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ఆ రిసిప్ట్ జత చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 డిసెంబర్ 31 లోగా పోస్టులో లేదా కొరియర్ ద్వారా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad-500076, Telangana.

Tags

Read MoreRead Less
Next Story