BSF Recruitment 2021: పదవతరగతి అర్హతతో బీఎస్ఎఫ్ ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు..

BSF Recruitment 2021: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 72 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేయబడింది. అర్హత కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం..
మొత్తం ఖాళీలు.. 72
కానిస్టేబుల్ (సీవర్ మ్యాన్): 2
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) : 24
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 28
కానిస్టేబుల్ (లైన్‌మెన్): 11
ఏఎస్ఐ: 1
హెచ్‌సీ : 6
కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా ఏఎస్ఐ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా అభ్యర్ధి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సం.లుగా నిర్ణయించబడింది. ప్రభుత్వ నింబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్ధులకు వయో సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in చూడొచ్చు. ప్రకటన వెలువడిన 45 రోజులలో ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com