BSNL Recruitment 2022: BSNLలో ఉద్యోగాలు.. జీతం రూ. 75,000

BSNL Recruitment 2022: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లీగల్ ప్రొఫెషనల్స్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మొదట కాంట్రాక్ట్ గడువు ఏడాది ఉంటుంది. అభ్యర్థుల పెర్ఫామెన్స్‌ని బట్టి కాంట్రాక్ట్ గడువును 2,3 ఏళ్లు పొడింగించే అవకాశం ఉంటుంది.
ఇతర వివరాలు..
LLB చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్ధులు తప్పనిసరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొంది ఉండాలి. LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.75 వేల వేతనం ఉంటుంది. ఏ ఇతర అలవెన్స్‌లు ఇవ్వబడవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్ధులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్, న్యూ ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.bsnl.co.in చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com