CA Exam: నేడే CA ఫైనల్, ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేస్కోండి..

ఛార్టెర్డ్ అకౌంటెంట్ (CA) ఇంటర్మీడియెట్, ఫైనల్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే నెలలో పరీక్షలు నిర్వహించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జులై 5న, అంటే నేడు విడుదల కావాల్సింది ఉంది.
దీనిపై ICAI ట్వీట్ చేసింది. "విద్యార్థులకు ముఖ్య గమనిక. 2023 మే నెలలో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ పరీక్ష, ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలు జులై 5న బుధవారం విడుదల అవుతాయి. అధికారిక వెబ్‌సైట్ https://icai.org/ లో లో ఫలితాలు పొందవచ్చు" అని తెలిపింది.
సీఏ ఫైనల్ పరీక్షను గ్రూప్-1, గ్రూప్-౨లుగా నిర్వహించారు. మే 2 నుంచి 9 మధ్య గ్రూప్-1 విభాగం, గ్రూప్-2ని మే 11 నుంచి 17 వరకు నిర్వహించారు. సీఏ ఇంటర్మీడియేట్ పరీక్షలను మే 3 నుంచి 10 మధ్య గ్రూప్-1 విభాగం, మే 12 నుంచి 18 మధ్య గ్రూప్-2 విభాగానికి పరీక్షలు జరిగాయి.
ఫలితాలు ఇలా చెక్ చేస్కోండి..
ICAI అధికారిక వెబ్‌సైట్ icai.org కి వెల్లండి.
వెబ్‌సైట్‌లో ఉంచిన ఫలితాల లింక్‌ని క్లిక్ చేయాలి.
తర్వాతి పేజ్‌లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్‌తో లాగిన్ అయితే వారి వారి ఫలితాలు వస్తాయి. అభ్యర్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com