Smoke Weed Job: స్మోకర్స్‌కి బెస్ట్ ఆఫర్.. రూ.88 లక్షల జీతం

Smoke Weed: ఏ ఉత్పత్తి అయినా మార్కెట్లోకి రావాలంటే ఎన్నో పరిశోధనలు చేయాలి. అన్నీ అయ్యాక అది ఎలా ఉందో చెప్పాలంటే అందులో నైపుణ్యం ఉన్న వ్యక్తులు కావాలి. అందుకోసం ఎంత జీతం ఇవ్వడానికైనా సిద్ధపడుతుంటాయి సదరు కంపెనీలు.
ఒక కంపెనీకి 'ప్రొఫెషనల్ స్మోకర్స్' అవసరం. ఈ వింత ఉద్యోగానికి మంచి జీతం కూడా అందజేస్తున్నారు. ఉద్యోగ ప్రకటన ప్రకారం, మీరు చేయాల్సిందల్లా సిగరెట్ గట్టిగా ఓ దమ్ములాగడం, దాని నాణ్యత ఎలా ఉందో పరీక్షించడం. ప్రతిఫలంగా మీకు రూ.88 లక్షల జీతం ఇస్తారు.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం, జర్మనీకి చెందిన ఓ కంపెనీ ఈ ప్రకటన చేసింది. దాని ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయగల ఉద్యోగి కోసం కంపెనీ వెతుకుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీ 'వీడ్ ఎక్స్‌పర్ట్' కోసం వెతుకుతోంది. వాస్తవానికి కంపెనీ పొగ త్రాగే వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఇందుకోసం రూ.88 లక్షలు (వార్షిక) వేతనం ఆఫర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com