Google Apprenticeship 2023: డిగ్రీ అర్హతతో గూగుల్‌లో ఉద్యోగాలు.. నేడే అప్లైకి ఆఖరు..

Google Apprenticeship 2023: సెర్చింజన్ సంస్థ గూగుల్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఆఖరు తేదీ అక్టోబర్ 27. ఎంపికైన అభ్యర్ధులు బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, గుర్‌గావ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్‌షిప్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్‌షిప్
డేటా అనలిటిక్స్ అప్రెంటిస్‌షిప్
డేటా అనలిటిక్స్ అప్రెంటిస్‌షిప్
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్
అర్హతలు..
డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్‌షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
పని అనుభవం: డిజిటల్ మార్కెటింగ్‌లో గరిష్టంగా 1 సంవత్సరం పని చేసిన అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్‌షిప్: ఇంజనీరింగ్/టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణత
పని అనుభవం: ఐటీ లేదా సంబంధిత సాంకేతిక విభాగంలో 6 నెలల అనుభవం ఉండాలి. కస్టమర్ సర్వీస్ రంగంలో అనుభవం.
డేటా అనలిటిక్స్ అప్రెంటిస్‌షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
పని అనుభవం: డేటా అనలిటిక్స్‌లో గరిష్టంగా 1 సంవత్సరం సంబంధిత పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
పని అనుభవం: ప్రాజెక్ట్ నిర్వహణలో గరిష్టంగా 1 సంవత్సరం అనుభవం
పని ప్రదేశం: బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, గురగావ్‌లో పని చేయాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం:
అప్రెంటిస్ వ్యవధి: 12-24 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటిస్ ప్రోగ్రామ్ ప్రారంభం: ఫిబ్రవరి 2023.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 27,2022.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com