Devara : దేవర టార్గెట్ రూ.120 కోట్లు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేవర సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగిందట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. కాబట్టి రూ.121 కోట్ల బ్రేకీవెన్ టార్గెట్ తో భరలోకి దిగుతోంది దేవర. ఇప్పటికే ఎన్టీఆర్ పై ఒక్క బ్రేకీవెన్ సినిమా కూడా లేదు అనే టాక్ ఉంది. మరి దేవరతో అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా, భారీ విజయం సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా? అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com