Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్ ఆప్షన్

Drone Pilot: టెన్త్ అర్హతతో డ్రోన్ పైలట్.. మరో బెస్ట్ కెరీర్ ఆప్షన్
Drone Pilot: టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది.. కొత్త కొత్త పరికరాలు వచ్చి మనుష్యుల పనిని సులభం చేస్తున్నాయి. ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. డ్రోన్ పైలెట్ కేవలం రిమోట్ ని ఆపరేట్ చేస్తే సరిపోతుంది.

Drone Pilot: టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది.. కొత్త కొత్త పరికరాలు వచ్చి మనుష్యుల పనిని సులభం చేస్తున్నాయి. ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. డ్రోన్ పైలెట్ కేవలం రిమోట్ ని ఆపరేట్ చేస్తే సరిపోతుంది.

అందుకే డ్రోన్ పైలట్‌లను రిమోట్ పైలట్లు అని కూడా అంటారు. ఒక డ్రోన్ పైలట్ డ్రోన్‌ను నియంత్రిస్తాడు, దీని వలన అది టేకాఫ్ అవుతుంది. దాంతో అది సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. అలాగే, డ్రోన్ పైలట్లు భద్రతా పరీక్షలను నిర్వహిస్తారు, వాహన పనితీరును పర్యవేక్షిస్తారు. డ్రోన్ వ్యవస్థల సామర్థ్యాలను అంచనా వేస్తారు. వారు డ్రోన్ మోసుకెళ్ళే కెమెరాలు లేదా ఇతర పరికరాలను కూడా ఆపరేట్ చేయవచ్చు. ఇందుకోసం పదవతరగతి విద్యార్హత సరిపోతుంది. స్వల్ప వ్యవధిలోనే శిక్షణ పూర్తి చేసుకుని డ్రోన్ పైలెట్ గా విధులు నిర్వర్తించవచ్చు.

పైలట్ విమానంలో కూర్చుని దాన్ని నడిపిస్తారు. కానీ డ్రోన్ పైలట్ రిమోట్ ద్వారా దాన్ని నడిపిస్తారు. ప్రస్తుతం పలు రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. మీరు పార్ట్ 107 లైసెన్స్ అని కూడా పిలవబడే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ మరియు కనీసం 40 గంటల డాక్యుమెంట్ చేయబడిన ఫ్లయింగ్ అనుభవాన్ని కలిగి ఉండాలి. భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి భారతదేశం ప్రపంచ డ్రోన్ హబ్ గా మారుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

పదవతరగతి పాసై 18 ఏళ్లు నిండితే డ్రోన్ పైలెట్ గా శిక్షణ తీసుకోవచ్చు. శిక్షణ కూడా ఐదు రోజుల్లో పూర్తయిపోతుంది. ఫీజు సంస్థను బట్టి మారుతుంది. రూ.50 వేల నుంచి లక్ష రూపాయలలోపు ఉంటుంది. అయితే శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగం కూడా త్వరగానే వస్తుంది. రూ.30 వేల వరకు వేతనం అందుతుంది. డ్రోన్ పైలట్ శిక్షణకు హైదరాబాద్ హబ్ కాబోతోంది.

మీరు పార్ట్ 107 లైసెన్స్ అని కూడా పిలవబడే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ మరియు కనీసం 40 గంటల డాక్యుమెంట్ చేయబడిన ఫ్లయింగ్ అనుభవాన్ని కలిగి ఉండాలి. 65 ఏళ్లలోపు వారు ఎవరైనా రిమోట్ పైలట్ లైసెన్స్ నిమిత్తం శిక్షణ తీసుకోవచ్చు. ఆంగ్లంతో పాటు, సాంకేతికతపై కొంచెం పట్టు ఉంటే మంచిది.

డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లైసెన్స్ తప్పనిసరి. డ్రోన్ లు నడపడానికి ఈ సంస్థ అనుమతులు ఉండాలి. డ్రోన్ శిక్షణ, మార్గ నిర్ధేశాలు, పరీక్షలు, లైసెన్స్ అంతా డీజీసీఏ పరిధిలో ఉంటాయి. దేశంలోని పలు సంస్థలు డ్రోన్ పైలెట్ శిక్షణ అందిస్తున్నాయి. చేరే ముందు డీజీసీఏ అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి.

ప్రభుత్ం డ్రోన్ టెక్నాలజీని ఆత్మ నిర్భర భారత్ లో భాగం చేసింది. అందువల్ల ఈ రంగంలో ప్రోత్సాహకాలు, అవకాశాలు ఊపందుకోనున్నాయి. 2030 నాటికి ప్రపంచ డ్రోన్ మార్కెట్ లో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా.

తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడెమీ డ్రోన్ పైలట్ శిక్షణ అందిస్తోంది. ఈ సంస్థకు 280 ఎకరాల ప్లైట్ ఏరియాతో పాటు 920 మీటర్ల రన్ వే ఉంది. ఇక్కడ శిక్షణ తీసుకోవాంలంటే రూ.60 వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరికొన్ని సంస్థలు.. ప్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, వింగ్స్ ఏవియేషన్, డ్రోన్ అకాడమీ సంస్థలు హైదరాబాద్ పరిసరాల్లో శిక్షణ అందిస్తున్నాయి.

ఐదు రోజుల శిక్షణ అనంతరం థియరీ, ప్రాక్టికల్స్ లో పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందిస్తారు. కోర్సులో భాగంగా డ్రోన్స్ ని పరిచయం చేస్తారు. శిక్షణలో భాగంగా డీజీసీఏ నిబంధనలు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పై ట్యుటోరియల్, సోలో ఫీల్డ్ ఫ్లయింట్ టెస్టు, డ్రోన్ ఫ్లైట్ ట్రైనింగ్, ఫ్లైట్ సిములేటర్ ట్రైనింగ్ ఉంటాయి. ఫ్లయిట్ కు సంబంధించి ప్రాథమికాంశాలు, ఏటీసీ ప్రొసీజర్లు, రేడియో టెలిఫోనీ, ఎమర్జెన్సీ ఐడెంటిఫికేషన్ అండ్ హ్యాండ్లింగ్ గురించి నేర్పిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story