Eastern Railway Recruitment 2022 : పది పాస్ అయితే చాలు.. రైల్వేలో 2,972 ఉద్యోగాలు.. !

Eastern Railway Recruitment 2022 : పది పాస్ అయితే చాలు.. రైల్వేలో 2,972 ఉద్యోగాలు.. !
Eastern Railway Recruitment 2022 : భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే యువతకి ఇది శుభవార్తే అని చెప్పాలి.. ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Eastern Railway Recruitment 2022 : భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే యువతకి ఇది శుభవార్తే అని చెప్పాలి.. ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,972 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు rrcer.comలోని RRCER అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభించబడుతుంది.. మే 10, 2022న ముగుస్తుంది. దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీ వివరాలు :

హౌరా డివిజన్: 659 పోస్టులు

లిలుహ్ డివిజన్: 612 పోస్టులు

సీల్దా డివిజన్: 297 పోస్టులు

కంచరపర డివిజన్: 187 పోస్టులు

మాల్డా డివిజన్: 138 పోస్టులు

అసన్సోల్ డివిజన్: 412 పోస్టులు

జమాల్‌పూర్ డివిజన్: 667

అర్హతలు :

ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. ఇక ఈ పోస్ట్ లకి దరఖాస్తు చేసుకునే వారి వయసు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

ఈ పోస్ట్ లకి దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags

Next Story