ECIL Recruitment 2022 : రాత పరీక్ష లేకుండా ఈసీఐఎల్‌లో 1,625 ఉద్యోగాలు.. జీతం నెలకి రూ. 24,780 వరకు.. !

ECIL Recruitment 2022 : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 1న మొదలైంది.. 11 ఏప్రిల్ తో ముగియనుంది.. ఈ పోస్ట్ లకి సెలెక్ట్ అయినవారికి రూ.20,480 నుంచి రూ. 24,780 వరకు నెలవారీ వేతనం ఉంటుంది. అయితే దరఖాస్తులు చేసుకునేవారు మార్చి 31, 2022 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 1625
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 814 పోస్టులు.. జీతం: రూ. 20,480
ఎలక్ట్రిషియన్- 184 పోస్టులు.. జీతం: రూ. 22,528
ఫిట్టర్- 627 పోస్టులు.. జీతం రూ. 24,780
పూర్తి వివరాలు ఇలా..
సంస్థ పేరు : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్ట్ పేరు : జూనియర్ టెక్నీషియన్
ఖాళీలు: 1625 పోస్ట్‌లు
జీతం : రూ. రూ.20,480 నుంచి రూ. 24,780 వరకు/-
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ : 01 ఏప్రిల్ 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11 ఏప్రిల్ 2022
విద్యాఅర్హత : ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / ఎలక్ట్రీషియన్ / ఫిట్టర్ ట్రేడ్‌లలో ITI (2 సంవత్సరాలు)
ఎంపిక ప్రక్రియ : షార్ట్‌లిస్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్
అధికారిక వెబ్‌సైట్ : www.ecil.co.in
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com