ESIC Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ESICలో ఉద్యోగాలు.. జీతం రూ.25,500-81,100

ESIC Recruitment 2022: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ (Steno), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలు 3,847. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
నోటిఫికేషన్ వివరాలు..
మొత్తం ఖాళీలు.. 3847
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC): 1726
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఫిబ్రవరి 15 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. జీతం రూ. 25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100.
స్టెనోగ్రాఫర్: 163
ఇంటర్ పాస్ కావాలి. డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్ తెలిసి ఉండాలి. 2022 ఫిబ్రవరి 15 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల నియామకం జరుగుతుంది. జీతం
రూ. 25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 1931
పదవతరగతి పాస్ కావాలి. 2022 ఫిబ్రవరి 15 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 లభిస్తుంది.
తెలంగాణ లోని ఖాళీల వివరాలు.. 72
UDC పోస్టులు : 25
స్టెనోగ్రాఫర్ పోస్టులు : 4
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 43
ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు: 35
UDC పోస్టులు : 7
స్టెనోగ్రాఫర్ పోస్టులు : 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 26
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు..
దరఖాస్తుకు చివరి తేదీ ఫ 2022 ఫిబ్రవరి 15
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్ధులు, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.250
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://www.esic.nic.in/ చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com