ESIC Recruitment 2022: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ESICలో ఉద్యోగాలు.. జీతం రూ. 56,900

ESIC Recruitment 2022: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) UDC, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్‌మెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 28 బ్రాంచుల్లో మరియు ఢిల్లీలోని ESIC ప్రధాన కార్యాలయానికి చెందిన ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 15 ఫిబ్రవరి 2022.
ఖాళీల వివరాలు..
స్టెనోగ్రాఫర్.. 162
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC).. 1736
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS).. 1964
విజయవాడలో ఖాళీల వివరాలు: UDC - 07, స్టెనో - 02, MTS - 26
హైదరాబాద్‌లో ఖాళీల వివరాలు: UDC - 25, Steno - 04, MTS - 43
వయోపరిమితి : (15 ఫిబ్రవరి 2022 నాటికి)
UDC & స్టెనో కోసం: 18 నుండి 27 సంవత్సరాల మధ్య.
MTS కోసం: 18 నుండి 25 సంవత్సరాల మధ్య.
వయస్సు సడలింపు - SC / ST వారికి 05 సంవత్సరాలు, OBCకి 03 సంవత్సరాలు మరియు PWDకి 10 సంవత్సరాలు.
పే స్కేల్ :
UDC & స్టెనో అభ్యర్ధులకు రూ.25,500 - 81,100/- (7వ CPC ప్రకారం)
MTS అభ్యర్ధులక: రూ.18,000 - 56,900/- (7వ CPC ప్రకారం)
అర్హతలు:
స్టెనోగ్రాఫర్:
(1) హయ్యర్ సెకండరీ (12వ తరగతి ఉత్తీర్ణతతో మెట్రిక్) లేదా తత్సమాన అర్హత.
(2) ఇంగ్లీష్ / హిందీలో స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం.
(3) కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానం.
UDC:
(1) ఏదైనా విభాగంలో లేదా తత్సమానంలో బ్యాచిలర్ డిగ్రీ.
(2) కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానం.
MTS:
(1) మెట్రిక్యులేషన్ / 10వ తరగతి పాస్ లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమానం.
దరఖాస్తు రుసుము:
రూ.250/- ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి / డిపార్ట్‌మెంటల్, మహిళా మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు.
ఇతరులకు రూ.500/-.
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
ఫేజ్ I - ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఫేజ్ II - మెయిన్ ఎగ్జామినేషన్
ఫేజ్ III - కంప్యూటర్ స్కిల్ టెస్ట్
ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత గల అభ్యర్థులు ESICలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ & MTS పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 15/02/2022 .
దశ 1: ESIC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి, www.esic.nic.in
దశ 2: హోమ్‌పేజీలో, ఎగువ ప్రధాన ట్యాబ్‌లో 'రిక్రూట్‌మెంట్' పై క్లిక్ చేయాలి.
దశ 3: ఆపై, స్క్రోలింగ్ లింక్‌పై క్లిక్ చేయండి 'స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి'.
దశ 4: 'కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి'పై క్లిక్ చేయండి.
దశ 5: లాగిన్ చేయడానికి రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఉపయోగించండి.
దశ 6: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి ఫీజు పే చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 డిసెంబర్ 2021
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com