FCI Recruitment 2021: ఎనిమిదో తరగతి అర్హతతో 'ఎఫ్‌సీఐ'లో ఉద్యోగాలు.. జీతం రూ.23,000

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదు, ఎనిమిది తరగతి విద్యార్హతతో 380 వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 19, 2021.
దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకుని అప్పుడు అప్లై చేయాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.23,000 నుంచి రూ.64,000 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలకు https://fci.gov.in/ లేదా https://recruitmentfci.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
ఎంపిక విధానం..
అభ్యర్ధిని రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
120 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షను ఇంగ్లీష్, హిందీ, పంజాబీలో నిర్వహిస్తారు.
పరీక్షలో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు.
మెరిట్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సందర్శించాలి.
ఇక్కడ category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి
అనంతరం నోటిఫికేషన్ చదవాలి.
అర్హతలు చూసుకున్న తరువాత దరఖాస్తు చేసుకోవడానికి https://fciharyana-watch-ward-in/login పైన క్లిక్ చేయాలి.
కుడివైపు ఉన్న Register Here పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
వచ్చిన instructions చదవాలి
దాని కింద ఉన్న చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి
పేరు, ఫోటో ఐడీ, ఈ మెయిల్, మొబైల్ నెంబర్, విద్యార్హతలు నింపాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు పూర్తయిన తరువాత ఫ్రింట్ తీసి ఉంచుకోవాలి.
అప్లై చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 19,2021.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com