Google: 'వర్క్ ఫ్రం హోం' ఉద్యోగులకు 'గూగుల్' కొత్త టూల్..

Google: కరోనా వైరస్ ఐటీ రంగంపై అంతగా ప్రభావం చూపలేదు. ముందుగానే అలెర్టై అందరికీ వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చింది. ఇంటి నుంచి పని చేస్తున్నా ఇంకా ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ తమ ప్రాజెక్ట్‌లను సకాలంలో కంప్లీట్ చేయించుకుంటున్నాయి ఆయా సంస్థలు. అయితే ఆఫీసుల్లో పని చేస్తున్న వారికి, ఇంటి నుంచి పని చేస్తున్న వారికి ఒకే రకమైన పే స్కేల్ ఉండకూడదని కంపెనీ భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇంటి నుంచి పని చేసే వారి కోసం ఓ కొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. దీని ఆధారంగా సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం.. ఆ ప్రాంతం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అలా ఆ ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. వారికి అదనంగా ఇంకా ఏమైనా సమకూర్చాలా అనేది కూడా ఆ టూలే నిర్ణయిస్తుంది. దీనిని బట్టి ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలి అనేవది వారే నిర్ణయించుకుంటారు. అవసరమైతే ట్రాన్స్‌ఫర్ వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా గూగుల్ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షన్నరకి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరిలో 60 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చే అవకాశం ఉందని గూగుల్ అంచనా వేస్తోంది. మరో 20 శాతం కొత్త ఆఫీస్ లొకేషన్స్‌లో పనికి సిద్ధం కావొచ్చని, మరో 20 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయొచ్చని అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com