పాన్-ఆధార్ అనుసంధానం.. కేవలం రెండు నిమిషాల్లో ఇలా... !

పాన్-ఆధార్ అనుసంధానం.. కేవలం రెండు నిమిషాల్లో ఇలా... !
మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే చేసుకోండి. ఒకవేళ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానాను కట్టాల్సి వస్తుంది.

మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే చేసుకోండి. ఒకవేళ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానాను కట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పాన్ కార్డుతో పాటు ఆధార్ నంబరును పేర్కోనడం అనేది తప్పనిసరి. ఆఒకవేళ పాన్ కార్డును ఆధార్ ‌తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా...

అయితే ఎలా అనుసంధానం ఎలా అనుకుంటున్నారా.. సింపుల్.. కేవలం రెండు నిమిషాల్లోనే చేసేయవచ్చు.. ఎలా అంటే.. మీ ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.. మొదటిగా ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తొలి పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి. ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి. దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అంతే ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి.

Tags

Read MoreRead Less
Next Story