HPCL Recruitment 2022: ఇంజనీరింగ్ అర్హతతో విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు.. రేపే అప్లైకు ఆఖరు తేదీ..

HPCL Recruitment 2022: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పలు విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకుగాను నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు జనవరి 14లోగా చేసుకోవాలి. పనిపరిమితి ఒక ఏడాది కాలవ్యవధి మాత్రమే. అర్హత, దరఖాస్తు చేసే విధానం..
సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
దరఖాస్తు ప్రారంభం.. 2022 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ.. 2022 జనవరి 14
వయసు .. 2022 జనవరి 7 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
స్టైఫండ్.. రూ.25,000
దరఖాస్తు చేసే విధానం..
* అభ్యర్ధులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action ఓపెన్ చేయాలి.
* తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
* రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత లాగిన్ చేయాలి.
* establishment request పైన క్లిక్ చేసి find establishment సెలెక్ట్ చేయాలి.
' సెర్చ్ ఆప్షన్‌లో hindustan Petroleum Corporation Limited టైప్ చేసి సెర్చ్ చేయాలి.
' apply బటన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com