IARI Recruitment 2022: పది అర్హతతో ఐఏఆర్‌ఐలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు..

IARI Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్.. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IARI) దేశవ్యాప్తంగా 641 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ వివరాలు..
1. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు (ICAR) చెందిన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IARI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 641 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ ఇనిస్టిట్యూట్‌లో 25 పోస్టులు ఉన్నాయి.
2. ఈ పోస్టులకు 2021 డిసెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 10 చివరి తేదీ. 2022 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 మధ్య పరీక్షలు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
3. మొత్తం 641 ఖాళీలు ఉండగా అందులో అన్‌రిజర్వ్‌డ్-286, ఈడబ్ల్యూఎస్-61, ఎస్‌సీ-93, ఎస్‌టీ-68, ఓబీసీ-133 పోస్టుల్ని కేటాయించారు. మొత్తం 641పోస్టుల్లో హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 25 ఖాళీలు ఉన్నాయి. ఐసీఏఆర్‌కు చెందిన ఆరు సంస్థల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
4. హైదరాబాద్ సంస్థలోని ఖాళీల వివరాలు.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్-8, ఐసీఏఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్-6, ఐసీఏఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్-6, ఐసీఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్-2, ఐసీఏఆర్-డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్-2, ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మీట్-1 పోస్టులున్నాయి.
5. అభ్యర్థుల వయసు 2022 జనవరి 10 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. అన్ రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.700 ఎగ్జామ్ ఫీజు, రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి.
6.ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 100 ప్రశ్నలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఎంపికైనవారికి రూ.21,700 బేసిక్ వేతనంతో పాటు ఏడో పే కమిషన్ లెవెల్ 3 ఇండెక్స్ 1
అలవెన్సులు లభిస్తాయి.
7. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్ధులు https://www.iari.res.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో టెక్నీషియన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. నియమనిబంధనలన్నీ చదివి Proceed To Register పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి. అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఇ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
8. ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com