Bank Jobs: 10వేల బ్యాంకు ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

Bank Jobs: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్) మల్టీపర్సస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రూరల్ బ్యాంకుల్లో 10వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజే ప్రారంభమైంది. అప్లైకి ఆఖరు తేదీ ఈనెల 28. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ https://www.ibps.in.
IBPS RRB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
విద్యార్హత: ఆఫీసర్ స్కేల్ 1,2,3 పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టుకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్దులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com