India Post GDS Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలు..

India Post GDS Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలు..
India Post GDS Recruitment 2022: ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 38,926 గ్రామీణ దాస్ సేవకులు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

India Post GDS Recruitment 2022: ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 38,926 గ్రామీణ దాస్ సేవకులు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు indiapostgdsonline.gov.in లో ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్ 5, 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: మే 02, 2022

దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ: జూన్ 5, 2022

ఖాళీలు

గ్రామీణ దాస్ సేవకులు (GDS): 38,926

జీతం

బీపీఎం రూ.12,000

ABPM/Dak Sevak రూ.10,000

అర్హత ప్రమాణాలు

పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా ఈ విద్యార్హతలను పూర్తి చేయాలి. 10వ తరగతికి చెందిన సెకండరీ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికేట్ తప్పనిసరి విద్యార్హత.

అభ్యర్థి స్థానిక భాషలో కనీసం 10వ తరగతి వరకు గణితం, ఆంగ్లము సబ్జెక్టులను చదివి ఉండాలి.

వయో పరిమితి

పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags

Next Story