indian army recruitment: బీఈ/బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు.. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అప్లై..

indian army recruitment: బీఈ/బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు.. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అప్లై..
indian army recruitment: ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీ 133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-133) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత యువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 26 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది.

మొత్తం: 40

సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ: 11

ఆర్కిటెక్చర్-1

ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-4

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ -9

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-3

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్-2

టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్-1

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-1

శాటిలైట్ కమ్యూనికేషన్-1

ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్-3

ఆటోమొబైల్ ఇంజనీరింగ్-1

టెక్స్‌టైల్ ఇంజనీరింగ్-1

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2021 జులై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 25, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 26, 2021

వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/

దరఖాస్తు చేసుకునే విధానం:

పైన తెలిపిన వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. Officers Entry Login ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. మీ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. వివరాలన్నీ సరి చూసుకుని సబ్‌మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

Tags

Next Story