Indian Army TGC Recruitment 2022: బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

Indian Army TGC Recruitment 2022: బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..బీటెక్ పాస్ అయినవారికి ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) 2022 కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ ఆర్మీ. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2022 జనవరి 4 చివరి తేదీ. ఈ పోస్టులకు పెళ్లికాని యువకులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి 49 వారాల శిక్షణ ఉంటుంది.
సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ 9
ఆర్కిటెక్చర్ 1
మెకానికల్ 5
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ 8
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ 1
టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2
ఏరోనాటికల్, ఏరో స్పేస్, ఏవియానిక్స్ 1
ఎలక్ట్రానిక్స్ 1
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 1
ప్రొడక్షన్ 1
ఇండస్ట్రియల్ మ్యాన్యూఫ్యాక్చరింగ్ 1
ఆప్టో ఎలక్ట్రానిక్స్ 1
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 1
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 1
దరఖాస్తు ప్రారంభం: 2021 డిసెంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 4 సాయింత్రం 3 గంటలు
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. బీటెక్ లేదా బీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు.
వయస్సు: 2022 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్లు. అంటే 1995 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్‌బీ, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్.
శిక్షణా కాలం: 49 వారాలు
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం..
Step 1: అభ్యర్ధులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
Step 2: హోమ్ పేజీలో Officers Entry Login పైన క్లిక్ చేయాలి
Step 3: ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి.
Step 4: అభ్యర్థి పేరు, ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి
Step 5: ఆ తర్వాత ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 6: ఫోటో, సంతకం పెట్టి అప్‌లోడ్ చేయాలి.
Step 7: వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com