Indian Navy: షార్ట్ సర్వీస్‌ కమిషన్‌(IT)లో ఖాళీల భర్తీకి ఆహ్వానం

Indian Navy: షార్ట్ సర్వీస్‌ కమిషన్‌(IT)లో ఖాళీల భర్తీకి ఆహ్వానం
ఆగస్టు 4 వ తేదీ నుంచి ఆగస్ట్ 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్‌ కమిషన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(SSC IT) ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 4 వ తేదీ నుంచి ఆగస్ట్ 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 1999 సంవత్సరం నుంచి 2004 సంవత్సరాల మధ్య జన్మించి, విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు షార్ట్ సర్వీస్ కమీషన్‌లో మొదటగా పదేళ్లపాటు విధులు నిర్వహిస్తారు. తర్వాత రెండు సంవత్సరాల చొప్పున కనీసం నాలుగు సంవత్సరాలు పొడిగించబడుతుంది. ఈ పొడిగింపు నేవీ అవసరాలు, పనితీరు, వైద్య అర్హత, అభ్యర్థుల అంగీరానికి లోబడి ఉంటుందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

అభ్యర్థులు www.joininidannavy.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 4వ తేదీ నుంచి రిజిస్టర్‌ చేసుకుని, సంబంధిత ధ్రువపత్రాలతో అప్లికేషన్లు పూర్తి చేయాలి.

విద్యార్హతలు..

అప్లై చేసుకునే అభ్యర్థులు 10 లేదా 12వ తరగతుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడంతో పాటు, కింద పేర్కొన్న విభాగాల్లో ఏదేని ఒక విభాగంలో కూడా కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.

1) B.Tech/M.Sc/M.Tech(కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్& నెట్‌వర్కింగ్, కంప్యూటర్ సిస్టమ్స్&నెట్‌వర్కింగ్, డేటా అనలటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)

2)ఎంసీఏ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ).

ఎంపికైన అభ్యర్థులు సబ్ లెఫ్టినెంట్ హోదాలో 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌లో పనిచేస్తారు.





Tags

Read MoreRead Less
Next Story