Indian Railways Recruitment: 8వ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. జీతం రూ .18,000 నుండి రూ .56,900 వరకు

Indian Railways Recruitment: ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వివిధ పోస్టులలో 1600 పైగా అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర సెంట్రల్ రైల్వేల పరిధిలో వివిధ విభాగాలు, వర్క్‌షాప్‌లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆసక్తి గల అభ్యర్థులు వివిధ పోస్టులలో అప్రెంటీస్‌ల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrcpryi.org లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1, 2021.
ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 1 పోస్టులలో భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ అభ్యర్థులకు పే స్కేల్ రూ .18,000 నుండి రూ .56,900 వరకు ఉంటుంది.
అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలకు మించి ఉండాలి. సెప్టెంబర్ 1, 2021 నాటికి 24 సంవత్సరాలు దాట కూడదు. అయితే కొన్ని కేటగిరీలకు వయస్సులో సడలింపులు ఇవ్వబడతాయి.
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10+2 విధానంలో మెట్రిక్యులేషన్ (క్లాస్ 10) ఉత్తీర్ణులై ఉండాలి. ఐటిఐ సర్టిఫికెట్‌తో 8 వ తరగతి పాసైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com