IPPB Recruitment 2021: డిగ్రీ అర్హత.. జీతం రూ. 94,000 నుంచి.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు..

IPPB Recruitment 2021: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 23 దరఖాస్తులకు చివరి తేదీ.
ముఖ్య సమాచారం
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత..
ఏదైనా గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవంతో పాటు సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి.
వయసు..
01.09.2021 నాటికి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్ధులను అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్/ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.94,000 నుంచి రూ.2,92,000 జీతం లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 23, 2021.
అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://www.ibponline.com/వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com