Navy Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..

Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్ పరిధిలోని అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు భారత నౌకాదళం యొక్క అధికారిక పోర్టల్ http://indiannavy.nic.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ముఖ్యమైన తేదీలు:-
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ- జూలై 8, 2022
ఖాళీల వివరాలు:-
మొత్తం పోస్టుల సంఖ్య- 338
విద్యా అర్హత:-
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:-
అభ్యర్థుల వయోపరిమితి ఆగస్ట్ 01, 2001 మరియు అక్టోబర్ 31, 2008 మధ్య ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com