LIC: టెన్త్ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు.. జీతం రూ. 7,000 - 25,000
LIC: ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ , ఫైనాన్స్ విభాగాల్లో ఉన్నాయి. స్త్రీ, పురుష అభ్యర్ధులిరువురూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధమైన రాత పరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.
ముఖ్య సమాచారం..
పోస్టులు : ఇన్సూరెన్స్ అడ్వైజర్
వయస్సు: 45 ఏళ్లకు మించరాదు
విద్యార్హతలు: 10 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: లేదు
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2022
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా
వేతనం: రూ.7,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com