Ayush Recruitment 2021: డిగ్రీ అర్హతతో 'ఆయుష్' శాఖలో ఉద్యోగాలు.. రూ.70,000 జీతం

Ayush Recruitment 2021: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వివరాలు..
మొత్తం ఖాళీలు.. 7
సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 10, 2021. అభ్యర్ధులు దరఖాస్తులను పోస్టులో పంపాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు..
సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్.. పోస్టుకు ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. జీతం రూ. 75,000
జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్.. పోస్టుకు ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. జీతం రూ. 50,000
అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ మేనేజర్.. పోస్టుకు ఎంబీఏ అర్హత.. జీతం. రూ.50,000
డేటా అసిస్టెంట్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్.. జీతం. రూ.20,000
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10+2 లేదా తత్సమాన అర్హత.. జీతం. రూ.16,000
గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
దరఖాస్తుకు చివరి తేదీ : 2021 నవంబర్ 10 సాయింత్రం 5.30 గంటలు
కాంట్రాక్ట్ గడువు : 2022 మార్చి 31 వరకు
విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి.
అనుభవం: రాష్ట్ర ప్రభుత్వాలు, రీసెర్చ్ కౌన్సిల్, ప్రభుత్వరంగ సంస్థల్లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 50 ఏళ్ల లోపు
ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం..
ఆయుష్ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
అభ్యర్ధి పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫామ్ నింపాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.
నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు పంపాలి.
అడ్రస్..
Assistant Advisor (SK),
Champion Services Sector Scheme,
Room No.8, AYUSH Bhawan,
B Block, GPO Complex
INA, New Delhi - 110023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com