రైల్వేలో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక

రైల్వేలో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక
X
అభ్యర్థులను అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రాయ్‌బరేలీ (యూపీ)లోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్) 110 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 1 దరఖాస్తులకు చివరి తేదీ.. అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://mcf.infianrailways.gov.in/వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు:110

ఫిట్టర్:55

ఎలక్ట్రీషియన్: 35

వెల్డర్: 20

ముఖ్య సమాచారం:

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు: 01.12.2020 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2020

వెబ్‌సైట్: https://mcf.indianrailways.gov.in/

Tags

Next Story