Navodaya Vidyalaya Samiti Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు..

Navodaya Vidyalaya Samiti Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు..
Navodaya Vidyalaya Samiti Recruitment 2022: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల్లో పనిచేసేందుకుగాను నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Navodaya Vidyalaya Samiti Recruitment 2022: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల్లో పనిచేసేందుకుగాను నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టెనో గ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింట్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషిన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితర విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హతలు..

అసిస్టెంట్ కమిషనర్: ఈ విభాగంలో మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ హ్యుమానిటీస్/సైన్స్/కామర్స్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్): ఈ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి.

మహిళా స్టాఫ్ నర్స్: ఈ విభాగంలో 82 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: ఈ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి.

ఆడిట్ అసిస్టెంట్: ఈ విభాగంలో 11 ఖాళీలు ఉన్నాయి. బీకామ్ పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: ఈ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/ పీజీ పాసైన అభ్యర్ధులు అప్లైకి అర్హులు.

జూనియర్ ఇంజనీర్ (సివిల్): ఈ విభాగంలో 1 పోస్ట్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

స్టెనో గ్రాఫర్ (గ్రూప్ సీ): ఈ విభాగంలో 22 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన అభ్యర్ధులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

కంప్యూటర్ ఆపరేటర్: డిగ్రీ కంప్యూటర్ డిప్లొమా చేసిన అభ్యర్ధులు అప్లూ చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 4. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు.

క్యాటరింగ్ అసిస్టెంట్: ఈ విభాగంలో 87 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్‌తో పాటు కేటరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్ధులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్లు ఉండాలి.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: ఈ విభాగంలో 630 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు. టైప్ రైటింగ్‌లో నాలెడ్జ్ ఉండాలి.

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: ఈ విభాగంలో 273 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 40 ఏళ్లు.

ల్యాబ్ అసిస్టెంట్: 142 పోస్టులు. టెన్త్, ఇంటర్ అర్హత, ల్యాబరేటరీలో డిప్లొమా చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవాలి.

మెస్ హెల్పర్: మొత్తం 629 ఖాళీలు. టెన్త్ పాసైన వారు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ విభాగంలో 23 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

అప్లై చేసుకునే విధానం..

ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తుకు ఫిబ్రవరి 10 ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

Tags

Next Story