LIC Jobs: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు.. జీతం రూ.25,000

LIC Jobs: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు.. జీతం రూ.25,000
LIC Jobs: ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.

LIC Jobs: ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ విభాగాల్లో వీరిని నియమిస్తారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో మార్కెటింగ్ అండ్ సేల్స్ విధులు నిర్వహించాలి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇవి పార్ట్ టైమ్ ఉద్యోగాలు. పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2021 డిసెంబర్ 31. నోటిఫికేషన్ వివరాలు..

మొత్తం ఖాళీలు: 100

పోస్టు: ఇన్సూరెన్స్ అడ్వైజర్

దరఖాస్తు ప్రారంభం: 2021 నవంబర్ 11

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 డిసెంబర్ 31

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.

అనుభవం: రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ

పోస్టింగ్: న్యూ ఢిల్లీ

వేతనం: రూ.7,000 నుంచి రూ.25,000 వరకు

దరఖాస్తు చేసుకునే విధానం:

* ముందుగా అభ్యర్ధులు నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్‌సైట్ https://www.ncs.gov.in/job-seeker ఓపెన్ చేయాలి.

* ఎల్ఐసీ జాబ్ పోస్టింగ్‌లో Apply పైన క్లిక్ చేయాలి.

* కొత్త యూజర్ అయితే న్యూ యూజర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.

* రిజిస్టర్ యాజ్ పైన క్లిక్ చేసి జాబ్ సీకర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

* రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి.

* నియమనిబంధనలు అంగీకరించి సబ్మిట్ చేయాలి.

* అనంతరం మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

* ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

* మీ లాగిన్ వివరాలతో లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్‌లో ఇతర సెక్షన్స్ పూర్తి చేయాలి.

* డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయడానికి డిజీ లాకర్ కనెక్ట్ చేయొచ్చు.

* ఆ తర్వాత ఎల్‌ఐసీ అడ్వైజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి.

* పాత యూజర్ అయితే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

* జాబ్ సెర్చ్‌లో ఎల్‌ఐసీ అడ్వైజర్ పోస్టును సెర్చ్ చేయాలి.

* ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

* దరఖాస్తు ఫామ్ డౌ‌న్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story