PGCIL Recruitment 2022: బీటెక్ అర్హతతో పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.1.60 లక్షలు

PGCIL Recruitment 2022: బీటెక్ అర్హతతో పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.1.60 లక్షలు
PGCIL Recruitment 2022: బీటెక్ అభ్యర్ధులకు గోల్డెన్ ఛాన్స్.. పవర్‌గ్రిడ్‌లో 105 ఉద్యోగాలు.. నెలకు రూ.1.60 లక్షల వరకు జీతం.

Power Grid 105 AET Jobs: పీజీసీఐఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ (AET) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Powergrid Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు సంబంధించి గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.powergrid.in/ చూడొచ్చు.

మొత్తం పొస్టుల సంఖ్య : 105

పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ

ఖాళీల వివరాలు: కంప్యూటర్ సైన్స్: 37, ఎలక్ట్రికల్: 60, సివిల్: 4, ఎలక్ట్రానిక్స్: 4

ట్రెయినింగ్ పీరియడ్ : ఏడాది

పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత రూ.50,000 నుంచి రూ.1,60,000 జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ 2021 కూడా ఉండాలి.

వయోపరిమితి: డిసెంబర్ 31, 2021 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.powergrid.in/


Tags

Read MoreRead Less
Next Story