Pooja Hegde : మరోసారి విజయ్ కి జోడీగా పూజా హెగ్డే
తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా దూసుకెళ్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు విజయ్. ఇటీవలే ‘ది గోట్‘ సినిమాని ప్రేక్షకుల ముందు నిలిపిన విజయ్ ప్రస్తుతం తన 69వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీ కానున్నాడట.
విజయ్ 69 కి ‘ఖాకి, తునీవు’ ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిరుధ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.
తాజాగా విజయ్ 69వ సినిమాకి సంబంధించి హీరోయిన్, విలన్ పాత్రల ఎంపిక ఖరారయ్యింది. ఈ మూవీలో విజయ్ కి జోడీగా పూజా హెగ్డే ఎంపికయ్యింది. గతంలో ‘బీస్ట్‘ మూవీలో విజయ్, పూజ కలిసి నటించారు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. అందులోని పాటలు ఎంతో హిట్ అయ్యాయి. అలాగే.. ఈ మూవీలో విలన్ గా బాబీ డియోల్ ని ఫైనలైజ్ చేశారు. ఈనెలలోనే విజయ్ 69 సెట్స్ పైకి వెళుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com