post office jobs: పదోతరగతి అర్హతతో పోస్టల్ సర్కిల్‌లో ఉద్యోగాలు.. బేసిక్ వేతనం రూ.25,500

post office jobs: ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2021 నుంచి ప్రారంభమైంది.
మొత్తం 221 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించారు. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2021 నుంచి ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి ఆఖరు తేదీ నవంబరు 12, 2021. దరఖాస్తుకు వెబ్‌సైట్ www.indiapost.gov.in ను సందర్శించాలి.
మొత్తం ఖాళీలు 221
పోస్టల్ అసిస్టెంట్ 72
పోస్ట్‌మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ 90
మల్టీ టాస్కింగ్ పోస్ట్ 59
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 12, 2021
విద్యార్హతలు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియెట్ పాస్ కావాలి. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్మీడియెట్ పాస్ అవ్వాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు పదవతరగతి పాసై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు
దరఖాస్తు ఫీజు: రూ.100
వేతనం: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది.
దరఖాస్తు విధానం..
* అభ్యర్థులు ముందుగా indiapost.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో అక్టోబర్ 4 తరువాత అప్లికేషన్ ఫాం అందుబాటులో ఉంటుంది.
అప్లికేషన్ ఫాం డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తు ఫారంను తప్పులు లేకుండా నింపాలి.
దరఖాస్తు పంపేందుకు పోస్టల్ అడ్రస్
AD (Rectt)
O/o CPMG,
Delhi Circle,
Meghdoot Bhawan,
New Delhi 110001
దరఖాస్తుకు చివరి తేదీ నవంర్ 12, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com