Prasar Bharti Recruitment 2022: డిగ్రీ అర్హతతో డిడి కిసాన్ ఛానల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.55,000

Prasar Bharti Recruitment 2022: డిగ్రీ అర్హతతో డిడి కిసాన్ ఛానల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.55,000
X
Prasar Bharti Recruitment 2022: ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆరేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

Prasar Bharti Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌క్యాస్టర్ ప్రసార భారతి పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిపార్డ్‌మెంట్‌లో మొత్తం 9 ఖాళీల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అప్లై చేయడానికి 2022 జనవరి 20 చివరి తేదీ. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు డీడీ కిసాన్ ఛానల్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : 3

సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. జీతం రూ.35,000 నుంచి రూ.40,000.

సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : 6

సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆరేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్ల లోపు ఉండాలి. జీతం రూ.50,000 నుంచి రూ.55,000.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా https://applications.prasarbharati.org/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో Register Yourself పైన క్లిక్ చేసి అభ్యర్ధి తన వివరాలతో రిజిస్టర్ చేయాలి.

ఆ తర్వాత లిగిన్ చేసి దరఖాస్తు చేయాలనుకున్న పోస్ట్ సెలెక్ట్ చేయాలి.

విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాలతో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

Tags

Next Story