నల్గొండ జిల్లాలో సంచలనంగా మారిన ప్రీతి మర్డర్ కేసు..!

నల్గొండ జిల్లాలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఏఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ప్రీతి ఈనెల 13న మృతి చెందింది. అటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేతేపల్లి ఎస్‌ఐ రామకృష్ణను వీఆర్‌కు అటాచ్ చేశారు. ఏఎస్పీ సతీష్‌ను విచారణాధికారిగా నియమించారు.. సమగ్ర విచారణతోపాటు.. వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. విచారణలో పారదర్శకత కోసమే ఎస్పీ స్థాయి అధికారికి నియమించామని తెలిపారు....
ప్రీతి.. నల్లగొండ జిల్లాలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఒకేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడుతున్నాడు. పదే పదే ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి ప్రీతి కనిపించకుండాపోయింది. దీంతో యువతి తల్లిదండ్రులు.. చుట్టుప్రక్కల గాలించారు. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి మడికట్లలో ప్రీతి విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు.. తమ కూతురు చావుకు పవనే కారణమని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో తన కూతురిని వేధించి.. చివరికి పవన్ హత్య చేశాడని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com