Railway Jobs: ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు తేదీ..

Railway Jobs: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నవంబర్ 15న నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1785 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అప్రెంటీస్ పోస్టులకు కనీస వయస్సు 15 సంవత్సరాలు.. కాగా, గరిష్ట వయసు 24 సంవత్సరాలు ఉండాలి. మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్ rrcser.co.in చూడొచ్చు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం ఒక్కరోజే మిగిలి ఉంది.
అర్హత: గుర్తింపు పొందిన కళాశాలలో పదోతరగతి, ఇంటర్ చదివి ఉండాలి. ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
అప్లైకి ఆఖరు తేదీ: డిసెంబరు 14
వెబ్‌సైట్: https://rrcser.co.in/pdf/act_2122.pdf
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com