Railway Jobs: పదవతరగతి అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు..

Railway Jobs
Railway Jobs: వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యుసిఆర్) వివిధ విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవసరమైన అర్హత మరియు సంబంధిత సబ్జెక్టులో అనుభవం ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు 2021 ఫిబ్రవరి 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టు కోసం ఈ నియామక ప్రక్రియ ద్వారా సుమారు 561 ఖాళీలను నియమించనున్నారు. WCR అప్రెంటిస్ 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఇప్పటికే wcr.indianrailways.gov.in లో ప్రారంభించబడింది. అభ్యర్థులందరూ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ చదవాలని సూచించారు. నియామక సమయంలో అభ్యర్థికి అవసరమైన అర్హత, వయోపరిమితి, ఇతర వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. https://wcr.indianrailways.gov.in/
మొత్తం ఖాళీలు: 561
డీజిల్ మెకానిక్ : 35
ఎలక్ట్రీషియన్ : 160
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రానిక్స్) : 30
మెషినిస్ట్ : 05
ఫిట్టర్ : 140
టర్నర్ : 05
వైర్ న్యూస్ : 15
మేసన్ : 15
కార్పెంటర్ : 15
పెయింటర్ : 10
గార్డెనర్ : 02
ప్లోరిస్ట్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ : 02
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ : 20
హార్టికల్చర్ అసిస్టెంట్ : 05
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటినెన్స్ : 05
కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ : 50
స్టెనోగ్రాఫర్ (హిందీ) : 07
వీటితో పాటు స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ జనరల్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ వెజిటేరియన్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ కుకింగ్, హోటల్ క్లర్క్ లేదా రిసెప్షనిస్ట్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, క్రెచ్ మేనేజ్ మెంట్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, హౌస్ కీపర్, హెల్త్ శానిటరీ ఇన్సెఫెక్టర్, డెంటల్ ల్యాబరేటరీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
ముఖ్య సమాచారం:
అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.170, ఎస్సీ ఎస్టీలకు రూ.70.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 27, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2021
వెబ్‌సైట్:https://wcr.indianrailways.gov.in/
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com